సాహో కోసం పాప్ స్టార్

-

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా ఈ ఇయర్ ఇండిపెండెన్స్ డే కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సుజిత్ డైరక్షన్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లో స్పెషల్ సాంగ్ కోసం పాప్ సింగర్ బెయాన్స్ తో పాడిస్తున్నారట.

ఆ సాంగ్ లో బెయాన్స్ తో పాటుగా 1000 మంది డ్యాన్సర్స్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. బ్లో, జెలస్ లాంటి పాప్ సాంగ్స్ తో బెయాన్స్ ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యింది. అలాంటి సింగర్ తో పాడించి సాహో మీద మరింత క్రేజ్ పెరిగేలా చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో స్టంట్స్ అందరిని ఆశ్చర్యపరుస్తాయని తెలుస్తుంది. మరి పాప్ సింగర్ తో చేస్తున్న ఈ సాంగ్ సాహోకి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news