అఖిల్ సినిమాలో కాజల్..?

-

Kajal Agarwal Latest Photos HD Stills Kajal Aggarwal Images, Hot Pics, Gallery, Stills

అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. మిస్టర్ మజ్ను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా కూడా తొలిప్రేమ లానే క్రేజీ లవ్ స్టోరీగా వస్తుందట. తొలిప్రేమ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి చేస్తున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరిగాయి. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

అయితే సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉండగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఆ పాత్రకు సెలెక్ట్ చేశారట. స్టార్స్ అందరితో జతకట్టిన కాజల్ అఖిల్ తో నటించడం సర్ ప్రైజ్ అనే చెప్పొచ్చు. కాజల్ ఈ సినిమాలో ఉందన్న విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారట. మరి సీనియర్ హీరోయిన్ కాజల్ తో అఖిల్ జోడీ కట్టడం ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news