7 ఏళ్ల తర్వాత ఆమెతో కలిసి చేస్తున్న నాని

-

హీరోగా నాని కెరియర్ మొదలైన సినిమా అష్టా చెమ్మ. అందులో హీరోగా మొదటిసారి ప్రేక్షకులను అలరించిన నాని ఆ తర్వాత నాచురల్ స్టార్ గా అవతరించాడు. నాని కెరియర్ లో అష్టా చమ్మ తర్వాత వచ్చిన అలా మొదలైంది సినిమా అతని కెరియర్ కు మరింత బూస్టింగ్ ఇచ్చింది. మళయాళ భామ నిత్యా మీనన్ కూడా తెలుగు పరిశ్రమకు పరిచయమైంది ఆ సినిమాతోనే. నందిని రెడ్డి డైరక్షన్ లో వచ్చిన అలా మొదలైంది సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఆ తర్వాత నాని, నిత్యల పెయిర్ సూపర్ అనిపించుకుంది. అలా మొదలైంది తర్వాత 2011లో వెప్పం తెలుగులో సెగ టైటిల్ తో రిలీజ్ అయ్యింది. అది నిరాశ పరచగా మళ్లీ వారిద్దరు కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కెరియర్ పరంగా ఎవరి సత్తా వారు చాటుతుండగా 7 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ సెట్ చేశారు.

దేవదాస్ తర్వాత భరత్ తిన్ననూరి డైరక్షన్ లో జెర్సీ సినిమా చేస్తున్నాడు నాని. క్రికెటర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కష్మిర పరదేశి నటిస్తుంది. అయితే ఆమెతో పాటుగా నిత్యా మీనన్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందట. సెగ తర్వాత 7 ఏళ్ల తర్వాత నాని, నిత్యా కలిసి నటిస్తున్నారు. సినిమాలు చేయకున్నా బయట మాత్రం నాని, నిత్యాలు మంచి స్నేహితులు.

Read more RELATED
Recommended to you

Latest news