జియో సెకండ్ బర్త్ డే ఆఫర్ అదుర్స్!

-

రిలయెన్స్ జియో సెకండ్ బర్త్ డే సందర్భంగా జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.100 కే నెల రోజుల పాటు అపరిమిత కాల్స్, 42 జీబీ డేటాను ఇవ్వనుంది. ఈ ఆఫర్ ను వరుసగా మూడు నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కోసం ప్రముఖ వాలెట్ ఫోన్ పేతో జియో టైఅప్ అయింది.

ఇదివరకు ఉన్న జియో ఆఫర్ 399 కి మార్పులు చేసి కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇదే ప్లాన్ లో వంద రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 299 రూపాయలకే సేవలను అందిస్తోంది. అంటే నెలకు 100 రూపాయలు చెల్లిస్తే చాలన్న మాట. మూడు నెలల పాటు అపరిమిత కాల్స్ తో పాటు నెలకు 42 జీబీ డాటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 1.5 జీబీ హైస్పీడు డేటా లభిస్తుంది. వీటితో పాటు అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా జియో ప్రవేశపెట్టింది.

అయితే.. ఆ ఆఫర్ ను కావాలనుకున్నవాళ్లు జియో యాప్ లోకి వెళ్లి ఫోన్ పే యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలి. ఫోన్ పే ద్వారా డబ్బులు పే చేస్తే 50 రూపాయల జియో క్యాష్ బ్యాక్, ఫోన్ పేలో 50 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు లభ్యమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news