భర్తను తలుచుకుంటూ మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి..!

-

నందమూరి తారకరత్న మరణించి దాదాపు రెండు నెలలు పూర్తి అవుతున్నా.. ఆయన భార్య మాత్రం తన భర్తను మర్చిపోలేక పోతుందనే వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యరెడ్డి , ముగ్గురు పిల్లలు ఒంటరి వారయ్యారు. తారకరత్న లేరన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా మరొకసారి తన భావోద్వేగాన్ని తారకరత్న పై తనకున్న ప్రేమను వరుసగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలియజేస్తోంది అలేఖ్య.

ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి పోస్ట్ పెట్టి అందరిని ఎమోషనల్ కి గురిచేసింది.. ఇక ఆ పోస్టులో..” ఈ జీవితానికి నువ్వు మరియు నేను మాత్రమే..మీరు అందించిన జ్ఞాపకాలతోనే జీవితాంతం బ్రతికేస్తాను. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.. ప్రస్తుతం అలేఖ్యరెడ్డి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమే కాదు భర్త పై ఆమెకున్న ప్రేమను చూసి ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ పోస్టు నెటిజన్ ల హృదయాలను కదిలించింది కూడా.

ఇప్పటికే నందమూరి, జై బాలయ్య హ్యాష్ ట్యాగ్ తో తన పోస్టును షేర్ చేయడంతో నందమూరి అభిమానులు కూడా స్పందిస్తున్నారు.. ధైర్యంగా ఉండండి అలేఖ్య గారు అంటూ ఆమె పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అలేఖ్య రెడ్డి తారకరత్నను రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే తారకరత్న కుటుంబ సభ్యులు వీరిద్దరిని దూరం పెట్టారు. ఇక తారకరత్న మరణం తర్వాత కూడా వీరు కలుసుకోకపోవడం గమనార్హం. ఇక యువగలం పాదయాత్రలో తారకరత్న గుండెపోటు వచ్చి దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణం సినీ ఇండస్ట్రీని కుదిపేసిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news