సాధారణంగా చాలామంది పెళ్లి తర్వాత బోల్డ్ గా ఫోటోషూట్ చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత తమ అందంలో మార్పులు వస్తాయి కాబట్టి తప్పకుండా ఫోటోషూట్ చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలియా అందంలో ఏ మార్పులు రాలేదని చెప్పాలి. ఇక ఆమె జోరు ఇంకాస్త పెంచింది. అవకాశాలు కూడా అంతే రేంజ్ లో వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఒక మ్యాగజైన్ పేజీ కోసం అదిరిపోయే ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
రంగుల హరివిల్లు మాదిరి మెరిసిపోతూ.. కెమెరా ఎదుట ఆమె ఇచ్చిన ఫోజులు అన్ని ఇన్ని కావు.. అసలు కెమెరాకు దాదాపు రెండేళ్లకు పైగా దూరంగా ఉండాలని అనుకున్నా.. ఇలా ఫోటోషూట్లు చేస్తూ మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. మొన్నామధ్య ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గాలాలో లక్ష ముత్యాలతో తయారుచేసిన అద్భుతమైన వైట్ కలర్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని లాగేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి రెడ్ కార్పెట్ పై మరింత ఆకర్షణగా నిలిచింది. అయితే ఇప్పుడు తాజాగా అరబ్ బజార్ మ్యాగజైన్ కోసం తన మేకప్ కిట్ కు పని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇక్కడ తన అంద చందాలతో మరింత గ్లామరస్ గా కనిపించింది. పిల్లల తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. రోజుల తరబడి కాల్ షీట్లు ఇస్తూ మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. ఏది ఏమైనా ఆలియా భట్ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. పిల్లలు ఉన్నా కూడా ఈమె అందంలో ఏ మార్పు రాలేదని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.
View this post on Instagram