ప్రతిభ, సక్సెస్, అందం, ఇమేజ్, యాటిట్యూడ్, ఎక్కువగా వార్తల్లో నిలవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వీరిని ఎంపిక చేశారు. అలియా గతేడాది ‘రాజీ’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. అలాగే ‘జీరో’, ‘వెల్‌కమ్ టు న్యూ ఇయర్’ చిత్రాల్లో గెస్ట్‌గా మెరిసింది.
ఇటీవల ది టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ గా మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, ప్రభాస్, రానా నిలిచిన విషయం విదితమే. తాజాగా ది టైమ్స్ ప్రకటించిన 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2018 జాబితాలో బాలీవుడ్ యువ సంచలన అలియాభట్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుని సీనియర్లకి షాక్ ఇచ్చింది.
2017లో 37వ స్థానంలో ఉన్న అలియా ఇప్పుడు మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో కత్రినా కైఫ్ మూడో స్థానం(2017లో నాల్గో స్థానం), దీపికా పదుకొనె నాల్గో స్థానం(2017లో రెండో స్థానం), అదితిరావు హైదరీ ఆరో స్థానం(2017లో 11వ స్థానం), జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎనిమిదో స్థానం(2017లో మూడోస్థానం), దిశా పటానీ తొమ్మిదో స్థానం(2017లో 19వ స్థానం), శ్రద్ధా కపూర్ 11వ స్థానం(2017లో 13వ స్థానం), కృతి సనన్ 13వ స్థానం(2017లో 14వ స్థానం), కైరా అద్వానీ 14వ స్థానం(2017లో 40వ స్థానం), అమీ జాక్సన్ 15వ స్థానం(2017లో ఆరవ స్థానం), సోనమ్ కపూర్ 38వ స్థానం(2017లో 24 వ స్థానం), తెలుగు కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్ 34వ స్థానం(2017లో 33వ స్థానం), పూజా హెగ్డే 41వ(2017లో 22వ) స్థానాల్లో నిలిచారు.
కొత్త నటీమణులు, మోడల్స్ మీనాక్షి చౌదరీ రెండో స్థానం, గాయత్రి భరద్వాజ్ ఐదో స్థానం, నేహల్ చుడసమా ఏడో స్థానం, అనుకృతి పదో స్థానం దక్కించుకున్నారు.
ప్రతిభ, సక్సెస్, అందం, ఇమేజ్, యాటిట్యూడ్, ఎక్కువగా వార్తల్లో నిలవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వీరిని ఎంపిక చేశారు. అలియా గతేడాది ‘రాజీ’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. అలాగే ‘జీరో’, ‘వెల్‌కమ్ టు న్యూ ఇయర్’ చిత్రాల్లో గెస్ట్‌గా మెరిసింది.
ఇటీవల ‘గల్లీబాయ్’, ‘కళంక్’లో నటించి ఆకట్టుకున్న అలియా ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రాలు ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’తోపాటు తెలుగులో ఎంట్రీ ఇస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’లో కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కథానాయికగా రాణిస్తుంది. టైమ్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో మొదటి స్థానంలో ఉండటం పట్ల అలియా ఆనందాన్ని వ్యక్తం చేసింది.
అదే సందర్భంలో తన దృష్టిలో మోస్డ్ డిజైరబుల్ ఉమెన్ కరీనా కపూర్ అని, మోస్ట్ డిజైరబుల్ మెన్ రణ్‌బీర్ కపూర్ అని తెలిపి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే తెలుగులో స్టార్స్ గా రాణిస్తున్న సమంత, అనుష్క, తమన్నా, రష్మిక మందన్నా, కీర్తి సురేష్ వంటి అగ్ర కథానాయికలకు ఇందులో చోటు దక్కకపోవడం గమనార్హం.