స్మృతి ఇరానీ అనుచరుడిని చంపేశారు..

-

బీజేపీ నాయకురాలు, అమేథీ ఎంపీ స్మృతీ ఇరానీ సహచరుడు, అనుచరుడు సురేంద్ర సింగ్ ను దారుణంగా చంపేశారు. అమేథీలోని బరూలియ గ్రామంలో నిన్న రాత్రి దుండగులు కాల్చి చంపారు. సురేంద్ర సింగ్.. బరూలియా గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ఆయన నివాసంలోనే ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

ఆయనపై కాల్పులు జరిపి దుండగులు పారిపోయారు. ఆయన రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సురేంద్ర సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేంద్ర సింగ్ మృతి చెందారు. సురేంద్ర సింగ్ హత్యపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పాతకక్షలు, రాజకీయ వివాదాలే ఈ హత్య కారణమై ఉండొచ్చని అమేథీ ఎస్పీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

సురేంద్ర సింగ్.. స్మృతి ఇరానీకి సన్నిహితుడు, ఆమె అనుచరుడిగా గ్రామస్తులు చెబుతున్నారు. ఆమె గెలుపు కోసం ఆయన మొన్నటి దాకా అమేథీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలిచిన రెండు రోజులకే ఈ ఘటన జరగడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news