రాజ‌మౌళికి అలియాభ‌ట్ మ‌ళ్లీ షాకిచ్చిందా?

ఎస్ఎస్ రాజమౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా చారిత్ర‌క వీరులుగా క‌నిపించ‌బోతున్నారు. ఎన్టీఆర్ కొమ‌రం భీంగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది.

ఇటీవ‌ల భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ని షూట్ చేశారు. ఇందులో అలియాభ‌ట్ సీత‌గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు `ఆర్ఆర్ఆర్‌` సెట్‌లో అడుగుపెట్ట‌లేదు. గ‌‌త కొన్ని నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ సెట్‌లో అడుగు పెట్ట‌ని అలియా తాజాగా సెట్‌లో ఎంట‌ర్ కాబోతోందంటూ వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అలియా సెట్‌లోకి ఎంట‌ర్ కావాలంటే మ‌రో రెండు వారాలు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

ఇది రాజ‌మౌళికి చిరాకు తెప్పిస్తోంద‌ట‌. అలియాభ‌ట్ ప్ర‌స్తుతం సంజ‌య్ లీలాభ‌న్సాలీ చిత్రం `గంగూబాయి కతియావాడి`లో న‌టిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఈ మూవీ కోసం మ‌రిన్ని డేట్స్‌ని కేటాయించింద‌ట‌. ఆ కార‌ణంగా రాజ‌మౌళి సినిమాకు రెండు వారాలు ఆల‌స్యం కానుంద‌ని తెలుస్తోంది.