`ఆర్ఆర్ఆర్` టీమ్‌కి అలియా డెడ్‌లైన్!

-

`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ డెడ్‌లైన్ పెట్టేసిందా? త‌నిచ్చి డేట్స్ అయిపోవ‌డంతో ఇచ్చిన డేట్స్‌లోనే షూటింగ్ చేస్తాన‌ని చెబుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపి‌స్తోంది. మ‌న‌ప్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు, నిజాంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి నైజాం ఏరియాలో సింహ‌స్నంగా మారిన ఆదివాసీ పోరాట యోధుడు ఒకానొక ద‌శ‌లో క‌లిసిస్తే ఎలా వుంటుంది?.. ఒక ద‌శ‌లో క‌నిపించ‌కుండా పోయిన ఇద్ద‌రు క‌లిసి ఒక్క‌టిగా పోరాటం చేస్తే ఎలా వుంటుంది? అన్న ఊహ‌లోంచి పుట్టిన క‌థ‌తో రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని ఓ ఫిక్ష‌న‌ల్ ప్లిక్‌గా తెర‌పైకి తీసుకొస్తున్నారు.

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంటు లాక్‌డౌన్ బిఫోర్ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని వ‌చ్చే నెల నుంచి ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ సీత‌గా రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ సెట్‌కి రాని అలియా త్వ‌ర‌లో సెట్‌కి రాబోతోంది. అయితే అక్టోబ‌ర్ వ‌ర‌కు మాత్ర‌మే త‌న డేట్స్ వున్నాయ‌ని, ఆ స‌మ‌యం త‌రువాత తాను హిందీ సినిమా షూటింగ్‌ల‌కు వెళ్లిపోతాన‌ని కండీష‌న్ పెట్టిన‌ట్టు చెబుతున్నారు.

దీంతో అలియా కోసం రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో అక్టోబ‌ర్ నుంచి `ఆర్ఆర్ఆర్‌` షూట్‌ని మొద‌లుపెట్ట‌బోతున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌లో అలియాకు సంబంధించిన పార్ట్‌ని మొత్తం ఫినిష్ చేయ‌బోతున్నార‌ట‌. ఓ పాట తో పాటు ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని రామ్‌చ‌ర‌ణ్‌, అలియాల‌పై షూట్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news