అందరి కళ్ళు ఆమె మీదే, అందరిలోనూ ఆమె గురించే చర్చట….!!

451

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే, ఫస్ట్ సినిమా బాగానే ఆడడంతో పాటు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ఆమె నటించిన ముకుంద, హిందీ లో తెరకెక్కిన మొహెంజెదరో సినిమాలు ఫ్లాప్ కాగా, ఆపై వచ్చిన డీజే సినిమా పర్వాలేదనిపించింది. ఇక ఆ తరువాత ఆమె ఏవిధంగా లక్కుతోక తొక్కిందో ఏమో తెలియదు గాని, ఆపై ఆమె నటించిన అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలానే ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలు అన్ని కూడా ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ కొట్టాయి.

దానితో ఆమెకు పేరు, క్రేజ్ అమాంతం పెరిగిపోయాయి. ఇక ఆ తరువాత ప్రభాస్ జాన్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాల్లో అవకాశం దక్కించుకున్న పూజ, రెండు రోజుల క్రితం సల్మాన్ హీరోగా నటించనున్న కభీ ఈద్ కభీ దీవాలి అనే సినిమాలో నటించే గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకుంది. మొత్తానికి ఇక్కడ టాలీవుడ్ లో పూజకు వరుస విజయాలు దక్కడం నిజంగా ఆమెకు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి.

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన పూజ గురించే చాలా వరకు అటు టాలీవుడ్ వర్గాల తో పాటు ఇటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది. నిజంగా ఇటీవల ఆమె వలె వేరొక హీరోయిన్ ఎవరూ కూడా ఆ విధంగా వరుసగా భారీ విజయాలు అందుకోలేదని, అయితే ఆయా సినిమాల్లో ఆమె తన అద్భుతమైన నటన, ఆకట్టుకునే అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంలో పూర్తిగా సఫలం అయిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో ఆమె నటిస్తున్న జాన్ తో పాటు అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సల్మాన్ సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తే ఆమె క్రేజ్ మరింత పెరగడం ఖాయం అని అంటున్నారు….!!