అతను కమీడియన్ కావచ్చు కానీ అతను చేసింది చూస్తే ఎవ్వరైనా చప్పట్లు కొడతారు !

Join Our Community
follow manalokam on social media

తెలుగు వెండితెరపై సైలెంట్ పంచులతో తనకంటూ సెపరేట్ కామెడీ ట్రాక్ క్రియేట్ చేసుకున్నాడు కమెడియన్ ప్రియదర్శి. ఇటీవలే మల్లేశం అనే సినిమాలో హీరోగా కూడా నటించడం జరిగింది. విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమా లో ప్రియదర్శి యాక్టింగ్ కి వరుస అవకాశాలు రావడం జరిగాయి. ఆ సినిమాలో నా చావు నేను చస్తా నీకెందుకు అనే డైలాగ్ ద్వారా ప్రియదర్శి కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడు.Image result for priyadarshi comedian pellichupulluఈ నేపథ్యంలో ఇటీవలే విదేశాలలో షూటింగ్ ముగించుకున్న కమెడియన్ ప్రియదర్శి విమానాశ్రయంలో  కరోనా టెస్టులు చేయించుకుని పూర్తిగా రెండు వారాల పాటు ఇంటికి పరిమితం అయ్యారు. విదేశాల నుండి భారతదేశానికి వచ్చే వాళ్ళు రెండు వారాల పాటు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్న ఇటువంటి సమయాలలో ఎవరు కూడా ఆ రూల్ పాటించడం లేదు.

 

కానీ కమెడియన్ ప్రియదర్శి తనవల్ల తన తోటివారికి, దేశానికి ప్రమాదం జరగకుండా పూర్తిగా ఇంటిలోనే రెండు వారాల పాటు ఉంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రియదర్శి బాధ్యతగా వ్యవహరిస్తున్న విధానానికి సోషల్ మీడియాలో చప్పట్లు కొట్టే విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. 

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...