మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సినిమా ఎనౌన్స్ చేయగానే ఆరోజు సాయంత్రమే సుకుమార్ తో సినిమా చేయట్లేదని ట్వీట్ పెట్టేశాడు మహేష్. క్రియేటివ్ డిఫరెన్స్ అని చెప్పడంతో కథ నచ్చకనే మహేష్ ఆ సినిమా వదులుకున్నాడని అన్నారు.
ఇదిలాఉంటే సుకుమార్ తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ చేసే విషయమై అరవింద్ తో ఆల్రెడీ నమ్రత డిస్కస్ చేశారట. అల్లు అర్జున్ కు ఆ కథ యాప్ట్ అవుతుందని మహేష్ వదిలేశాడట. అయితే వేరే కథతో సుకుమార్ తో సినిమా చేస్తారని అనుకోగా భవిష్యత్తులో సుకుమార్ తో అసలు సినిమానే ఉండదన్నట్టు అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు సుకుమార్.
మరోపక్క సందీప్ వంగ డైరక్షన్ లో మహేష్ చేయాల్సిన సినిమా అల్లు అరవింద్ నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా గురించి మాత్రం ఇంకా ఎనౌన్స్ మెంట్ రాలేదు.