నాగార్జునని భయపెట్టిన బాలకృష్ణ..!

-

నందమూరి బాలకృష్ణ నాగార్జునని భయపెట్టడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. అప్పట్లో ఎన్.టి.ఆర్, ఏయన్నార్ సమ ఉజ్జీలుగా తమ సినిమా ప్రస్థానం కొనసాగించారు. అయితే ఎన్.టి.ఆర్ సినిమా ఫాలోయింగ్ ను పాలిటిక్స్ కు వాడుకున్నాడు నాగేశ్వర్ రావు మాత్రం అలా చేయలేదు. తుదిశ్వాస వరకు సినిమానే ఊపిరిగా భావించారు ఏయన్నార్. ఇదిలాఉంటే ఈమధ్య రిలీజైన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

సినిమాకు టాక్ బాగున్నా వసూళ్ల పరంగా సినిమా వెనుకపడి ఉంది. అసలైతే ఒక సినిమాగా తీయాలని అనుకున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ రిజల్ట్ తెలిసింది. ఇక రాబోతున్న రెండో పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎన్.టి.ఆర్ బయోపిక్ రిజల్ట్ చూసిన నాగార్జున తన తండ్రి బయోపిక్ చేయాలన్న ఆలోచన మానుకున్నట్టు తెలుస్తుంది.

మహానటుడు, గొప్ప నాయకుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ నాగార్జునకి షాక్ ఇచ్చింది. ఎన్.టి.ఆర్ బయోపిక్ హిట్టైతే తండ్రి బయోపిక్ తీద్దామని అనుకున్నాడు కాని సినిమా ఫలితం అందుకు భిన్నంగా ఉండటంతో బాలకృష్ణను చూసి నాగార్జున భయపడుతున్నాడు. నాన్న గారి సినిమాలనే రీమేక్ చేసే సాహసం చేయలేని తాను ఆయన బయోపిక్ ఎలా చేయగలను అంటూ అఖిల్ మిస్టర్ మజ్ను ప్రమోషన్స్ లో నాగార్జున అనడం విశేషం. సో ఏయన్నార్ బయోపిక్ మాత్రం ఉండదని నాగార్జున ఖరాకండిగా చెప్పేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news