కేరళలో వర్షం కారణంగా జనాల ఇక్కట్లు పడుతున్నారు. బీభత్సమైన వర్షాల కారణంగా ప్రజలంతా రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ప్రక్రుతి వైపరీత్యాల వల్ల కేరళ ప్రజలు కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలోని ప్రజలందరిని వేరే చోటికి తరలించేలా ప్రభుత్వ కార్యచరణలు చేపట్టారు. ఈ క్రమంలో హీరోలు తమ వంతు సాయంగా కేరళ వరదలకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు విరాళాలు ఇస్తున్నారు.
ఇప్పటికే కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి కలిసి కేరళ వరదల నష్టాన్ని పాతిక లక్షల సాయం చేయగా.. నిన్న రాం చరణ్ దంపతులు, విజయ్ దేవరకొండ కూడా సహాయాన్ని ప్రకటించారు. కేరళలో బన్నికి స్టార్ క్రేజ్ ఉంది. బన్ని చేసిన ప్రతి సినిమా మళయాలంలో డబ్ అవుతూ వస్తుండగా అక్కడ స్టార్స్ తో సమానంగా వసూళ్లను రాబట్టాయి. అందుకే అక్కడ ప్రజలకు కష్టం వచ్చిందని తెలుసుకున్న అల్లు అర్జున్ పాతిక లక్షల సాయం ప్రకటించాడు. బన్ని మంచి మనసుకి అందరు ఫిదా అవుతున్నారు.