అలాంటి పాత్రలో బన్నీ.. డేరింగ్ చేస్తున్నాడా..!

-

తెలుగు చిత్రసీమలో హీరోలందరూ విలక్షణ కథల బాట పట్టారు. తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోలు సహజత్వం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. తాజాగా మెగా హీరో అల్లువారబ్బాయి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అంధుడు/ వికలాంగుడి పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడట.

ప్రస్తుతం ఈ మెగా హీరో టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ తో కలిసి… ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే కథగా చెప్పబడుతున్న పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చివరికి రావడంతో తాను తదుపరి చేయబోయే సినిమాలను లైన్ లో పెడుతున్నాడట ఈ హీరో. అల్లు అర్జున్ త్వరలో ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో పుష్ప సినిమా శరవేగంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అనంతరం వకీల్‌సాబ్‌ దర్శకుడు శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తాడని సమాచారం. శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో చేసే ఈ సినిమాలో ఈ హీరో విలక్షణ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర నచ్చే బన్నీ కమిట్ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ బ్యాక్ డ్రాప్ లో పుష్ప సినిమా నిర్మితమవుతుంది. స్టైలిష్ స్టార్ తొలిసారి లారీ డ్రైవర్‌ పాత్రలో మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. అల వైకుంఠపురం సినిమాతో భారీ హిట్ అందుకున్న మెగా హీరో తాను తర్వాత చేయబోయే పుష్ప మూవీపై ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేస్తున్నాడట. ఈ సినిమాలో నేషనల్ క్రష్ అందాల భామ రష్మిక మందన్నా.. హీరోయిన్ గా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news