‘పుష్ప’రాజ్‌తో పీవీ సింధు సందడి..తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్ అభిమానులు..

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ…ఐకాన్ స్టార్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ సినిమా ‘పుష్ప’. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో ‘పుష్ప’రాజ్ గా బన్నీ అదరగొట్టేశాడు.

‘పుష్ప: పార్ట్ వన్ ది రైజ్’ సినిమాకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. పార్ట్ టూ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ కు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా, హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటించింది.

ఈ సంగతులు పక్కనబెడితే..‘పుష్ప’ రాజ్ క్రేజ్ అయితే..తగ్గేదేలే అన్నట్లుగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్ లో బన్నీతో ఫొటోలు దిగేందుకు ప్రముఖులు సైతం వెయిట్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు బన్నీ కనబడగానే ఆయనతో ఫొటో దిగడం విశేషం. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. హైదరాబాద్ లో జరిగిన ఓ మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరైన బన్నీ..నూతన వధూవరులను ఆశీర్వదించారు.