రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆఖరికి వైసీపీ మాటే నెగ్గింది. ఓ విధంగా ఈ రహస్యం సాయిరెడ్డికి ముందే తెలుసు అని కొన్ని మీడియాలు కోడై కూశాయి. కానీ ఆ కాకి గోలనూ, కోడి కూతలనూ తాము పెద్దగా పట్టించుకోలేదు అని వైసీపీ అంటోంది. తాము అనుకున్న విధంగా రాజకీయం నడిపామని కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై బీజేపీ మనసులో ఉన్న మాటను మాత్రం గ్రహించి ఆ మేరకు నడుచుకున్నది అని విశ్లేషకులు సైతం అంటున్నారు.
ఇప్పుడు ఓ వర్గం మీడియాలో డైలమా ఉంది అని తెలుస్తోంది. ఏం రాయాలి అన్నది కాదు ఏ విధంగా రాసి ఈ పరిణామాలను తమకు అనుగుణంగా మలుచుకోవాలని..! అవి ఆశ పడుతున్నాయని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. వాస్తవానికి వెంకయ్య పేరును ఆఖరిదాకా వినిపించిన ఓ వర్గం మీడియా ఇప్పుడు మాత్రం కొంత తగ్గింది అని తెలుస్తోంది. చంద్రబాబు సైతం ఈ విషయంలో కొంత రాజకీయం నడపాలని అనుకున్నా కూడా అది నెగ్గే వీల్లేదని తేలిపోయింది అని వైసీపీ వాదిస్తోంది. ఈ తరుణాన టీడీపీ మద్దతు ఎవరికి ఉంటుంది అన్న విషయమై చర్చ నడుస్తోంది.
వాస్తవానికి ఇప్పటికప్పుడు చంద్రబాబు నిర్ణయం వెలువడకున్నా రాష్ట్రపతి ఎన్నికల విషయమై తటస్థంగానే ఉండాలని టీడీపీ అనుకుంటోంది అని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇచ్చినా వ్యతిరేక సంకేతాలు వెళ్తాయి అని భావిస్తోందని, కనుక వీలుంటే యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడం లేదంటే సైలెంట్ అయిపోవడం అన్నది చేయవచ్చని అంటోంది.అయితే టీడీపీ బలం పె ద్దగా లేకపోవడం వలన ఆ పార్టీ నేతలు ఎటు ఉన్నా అవి రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపవు. వాస్తవానికి ఇదంతా కాస్త మేథావులకు, ఓ ఉన్నత వర్గంకు సంబంధించిన చర్చ. సామాన్యుల వరకూ రాష్ట్రపతి ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు అన్న వాదన కూడా ఉంది.
అతి తక్కువ స్థాయిలో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. కేసీఆర్ కూడా విపక్ష కూటమికే మద్దతు ఇవ్వనున్నారు అని ఓ సమాచారం. ఎందుకంటే కేసీఆర్ బాహాటంగానే బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు కనుక ! ఆ విధంగా కాకుండా ఓ గిరిజన మహిళకు మద్దతిచ్చి ప్రజల్లో సానుభూతి కనుక పొందాలనుకుంటే బాబు కానీ కేసీఆర్ కానీ బీజేపీ బలపరిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వవచ్చు. కనుక ఏ నిమిషంలో ఏ నిర్ణయం అయినా మారవచ్చు. అత్యున్నత స్థాయి పదవికి సంబంధించిన వర మాల ఎవరిని వరిస్తుందో అన్నది ఇప్పటికింకా సస్పెన్స్ .