
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఓ కొత్త ట్యాగ్ లైన్ ఇచ్చాడు యువ హీరో శర్వానంద్. తన లేటెస్ట్ మూవీ పడి పడి లేచే మనసు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ ఈమధ్య టచ్ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అవడంతో తన సినిమాకు ఆయన గోల్డెన్ హ్యాండ్ అవుతాడని పిలిచామని అన్నాడు. ఈమధ్య ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ గా అల్లు అర్జున్ పేరు వినిపిస్తుందని.. విజయ్ దేవరకొండకు రెండు హిట్లు వచ్చాయి. తనకు ఈ సినిమా హిట్ అవుతుందని బన్ని టచ్ ఇచ్చాడని అన్నాడు శర్వానంద్.
ఇక బన్ని బాబు బిజీ షెడ్యూల్ లో ఉన్నా సరే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ అని చెప్పాడని.. చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి సినిమా అంటే బన్ని దగ్గర నుండి కాల్ వస్తుందని అన్నాడు. ఇక తమలాంటివారందరికి బన్ని స్పూర్తని.. 100 శాతానికి 150 శాతం కష్టపడే మనస్థత్వం కలవాడు బన్ని అని.. అందుకే అతనికి ఆ స్టార్ క్రేజ్ అన్నాడు శర్వానంద్. ఇక అతను మాట్లాడుతున్న టైంలో జై పవర్ స్టార్.. జై సాహో అంటూ అక్కడ ఉన్న పవర్ స్టార్, ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు శర్వానంద్.