కాన్ఫిడెన్స్..ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది.. బండ్ల గణేష్

-


మొన్న జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పీక కోసుకుంటా అని మాటిచ్చిన బండ్ల గణేష్ ఎట్ట కేలకు స్పందించారు. తెరాస ప్రభంజనంతో కాంగ్రెస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో నాటి నుంచి నేటి వరకు మీడియకు చిక్కకుండా తిరుగుతున్న గణేష్ నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో మీడియా కంటపడ్డారు. దీంతో చేసేదేమి లేక మీడియాతో ముచ్చటించారు… అనంతరం కాస్త నవ్వండి సార్.. ఎలా ఉన్నారు అని మీడియా పలకరిస్తే.. ఈ విధంగా స్పందించారు. ‘ఏం నవ్వుతాం.. నవ్వే పరిస్థితా మాది.. ఒక ఓటమి విజయానికి పునాది.

అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. అందర్నీ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానల్లలో నేను అజ్ఞాతంలో ఉన్నా అంటున్నారు. కాని నేను అజ్ఞాతంలో లేను. పార్టీ ఓటమిని తట్టుకోలేక రెండు మూడు రోజులు బాధతో బయటకు రాలేదు. మనం ఎన్నో ఊహించుకుంటాం.. అవన్ని జరగవు కాదా? ప్రజలు మా పక్షాన లేకపోవడం బాధ కలిగించింది. మా పార్టీ నాయకులకు కాన్ఫిడెన్స్ ఇద్దాం అని పీక కోసుకుంటా అన్నా.. ఆ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. ఏం చేస్తాం.. అలా అని ఇప్పుడు పీక కోసుకోలేను కదా? అంటూ సమాధానమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news