అల్లు అర్జున్ తో ఆ దర్శకుడి సినిమా అటకెక్కిందా….??

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకముందు ఆయన నటించిన డీజే, నా పేరు సూర్య సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత ఆలోచన చేసిన బన్నీ, ఎట్టకేలకు త్రివిక్రమ్ తో సినిమా చేయడం, అది మంచి హిట్ అందుకుని ఆయనకు కెరీర్ పరంగా బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమా చేస్తున్న బన్నీ,

ఇటీవల కొద్దిరోజుల క్రితం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఐకాన్ అనే సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రారంభం కావలసిన ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడం, అలానే ఆ వెంటనే దర్శకుడు వేణు, తన తదుపరి సినిమాని పవన్ కళ్యాణ్ తో ఇటీవల మొదలెట్టడం జరిగింది. ఇక మరోవైపు బన్నీ కూడా సుకుమార్ సినిమా తరువాత మరొక స్టార్ దర్శకుడితో చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐకాన్ సినిమా అటకెక్కిందనే వార్తలు ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

 

అయితే కొందరు బన్నీ సన్నిహితులు చెప్తున్నా దానిని బట్టి, నిజానికి ఐకాన్ సినిమా పూర్తిగా ఆగిపోలేదని, అయితే ప్రస్తుతం అటు బన్నీ, ఇటు వేణు శ్రీరామ్, తమ తమ ప్రస్తుత కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో దిల్ రాజు కూడా దానిని ప్రక్కన పెట్టారని, వీలైనంత త్వరగా ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని, అయితే పక్కాగా ఫలానా టైం లో మొదలవుతుంది అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేం అని అంటున్నారట….!!