ఏంటి బన్ని చేసేది త్రివిక్రంతో కాదా..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడు అన్న దాని మీద ఇంకా ఓ ఫైనల్ డెశిషన్ తీసుకోలేదు. అసలు దర్శకుడు ఎవరన్నది కూడా ఇంకా నిర్ణయిచుకోలేదు. నిన్నటిదాకా త్రివిక్రంతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని హడావిడి చేశారు. ఇంకేముంది ఎనౌన్స్ చేయడమే లేటని అన్నారు. కాని ఇక్కడే చిన్న ట్విస్ట్ గీతా గోవిందం దర్శకుడు పరశురాం ఓ క్రేజీ స్టోరీ బన్నికి వినిపించాడట.

ఇప్పుడు బన్ని అతను చెప్పిన దాని మీద దృష్టి పెట్టాడట. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమానే బన్ని నెక్ష్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాల వారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబడుతుందట. గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం బన్నితో ఛాన్స్ కొట్టేయడం అతని లక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుస హిట్లు కొడుతున్న పరశురాం ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news