
చంద్రబాబు మిలీనియం ఆఫ్ ది జోక్ వేశారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా కేసీఆర్ పనిచేస్తున్నారట. దేవుడా.. ఈ బాబు ఇక మారడా? వెన్నుపోటుకు, కన్నింగ్ కు కేరాఫ్ అడ్రస్ బాబు. అటువంటి బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడట. బాబూ.. చంద్రబాబు, నిన్ను చూసి ఏపీ ప్రజలే నవ్వుకుంటున్నారు. నువ్వు పెడితే పెళ్లి కోరుతవు.. లేకపోతే చావు కోరుతవని అందరికీ తెలుసు. ఇన్నిరోజులు మోదీతో రాసుకుపూసుకు తిరిగినవు. ఇప్పుడు మీ ఇద్దరికీ చెడింది. దీంతో మోదీపై నిప్పులు చెరుగుతున్నావు.
మోదీకే నీతులు చెబుతున్నావు. మోదీ దేశానికి ప్రధాని కానీ.. గుజరాత్ కు కాదంటూ ఆయన మీదే జోకులు వేస్తున్నావు. మరోవైపు సీఎం కేసీఆర్ ఒడిశా సీఎంను కలిసేసరికి.. నీకు పించాం పించాం అంటోందా? కేసీఆర్ ఒడిశా సీఎంను కలిసినంత మాత్రాన ఏపీ అభివృద్ధిని అడ్డుకున్నట్టేనా? ఆయన ఒడిశా సీఎంను కలిసిన పర్పస్ వేరే? నువ్వు మాట్లాడేది వేరే? ఏమన్నా సంబంధం ఉందా నువ్వు మాట్లాడే మాటలకు. చంద్రబాబు మాట్లాడిన వీడియో చూస్తారా?
(Video Courtesy: TV9)