ది టీం ఆఫ్ ఎన్టీఆర్.. ఫుల్ కాస్ట్ డీటైల్స్..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ తో నందమూరి బాలకృష్ణ ఓ పెద్ద సాహసం చేశాడని చెప్పొచ్చు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుండే మొదలుపెట్టారు బాలకృష్ణ అండ్ టీం. ఈ క్రమంలో సినిమాలో ఉన్న ప్రతి పాత్ర దాన్ని పోశించిన నటుడి పేర్లను బయట పెట్టారు.

ముఖ్యంగా విద్యాబాలన్ చేసిన బసవతారం.. హరికృష్ణ గా కళ్యాణ్ రాం, ఏయన్నార్ గా సుమంత్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా ఇలా క్రేజీ కాస్టింగ్ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఉన్నారు. అంతేకాదు రకుల్, హాన్సిక, పాయల్, నిత్యా మీనన్ వంటి హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఎన్.టి.ఆర్ బయోపిక్ ఫుల్ కాస్ట్ డీటైల్స్ వారు పోశించిన పాత్రల వివరాలు చూడండి..

నందమూరి తారక రామారావు : బాలకృష్ణ
బసవ రామ తారకం : విద్యా బాలన్
నందమూరి త్రివిక్రమరావు : దగ్గుబాటి రాజా
నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్
లోకేశ్వరి : పూనమ్ బజ్వా
భువనేశ్వరి : మంజిమా మోహన్.
సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్
పురంధేశ్వరి : హిమన్సీ
ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి
నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్.
అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్
రామోజీరావు : గిరీష్
ఎస్వీ రంగారావు : ఈశ్వర్ బాబు
నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా
మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్.
హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ
దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్.
రేలంగి : బ్రహ్మానందం
నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్
ఆలూరి చక్రపాణి : మురళీ శర్మ
ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త
శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్
నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్
బి ఏ సుబ్బారావు : నరేష్
పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్
కే వీ రెడ్డి : క్రిష్ జాగర్లమూడి
పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా
బి విఠలాచార్య : ఎన్ శంకర్
కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్
వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్
సావిత్రి : నిత్యామీనన్
జయప్రద : హన్సిక మోత్వాని
ప్రభ : శ్రీయ
జయసుధ : పాయల్ రాజపుత్
యోగానంద్ : రవిప్రకాష్
తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు
టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర
పేకేటి శివరాం : భద్రం
షావుకారు జానకి : షాలిని పాండే
పింగళి : సంజయ్
మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్
గుమ్మడి : దేవీ ప్రసాద్
జీ వరలక్ష్మీ : ప్రత్యూష
పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు
కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి
ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్
సీ నారాయణరెడ్డి : రామజోగయ్య శాస్ట్రీ
ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్
కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి
డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల
కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్
సలీం మాస్టర్ : రఘు మాస్టర్
దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి
చల్మేశ్వర్ రావు : నాగరాజ్
రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్

Read more RELATED
Recommended to you

Latest news