‘ఐకాన్’ లో అల్లు అర్జున్ సర్ ప్రైజ్

65

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా వస్తుంది. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 24 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అసలైతే సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది కాని సడెన్ గా వేణు శ్రీరాం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ఐకాన్ అని పెట్టారు. ఐకాన్ ఉపశీర్షికగా కనబడుట లేదు అని పెట్టారు. ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే అల్లు అర్జున్ ఇప్పటివరకు తన కెరియర్ లో చేయనిది ఈ సినిమా కోసం చేస్తున్నాడట. అదేంటి అంటే 18 సినిమాల్లో అల్లు అర్జున్ సోలోగా చేశాడు. కాని ఐకాన్ కోసం డ్యుయల్ రోల్ చేస్తున్నాడట. అంతేకాదు సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ అలియా భట్ ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట.

ఆల్రెడీ అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు బన్ని ఆఫర్ కూడా ఓకే చేస్తే బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా అమ్మడు అదరగొట్టేయొచ్చు. బన్ని ఐకాన్ కచ్చితంగా తన ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. మరి అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.