Allu Arjun: స్పెక్టాకులర్ షో..KGF2పై ‘పుష్ప’రాజ్ కామెంట్స్ ఇవే

-

దేశవ్యాప్తంగా KGF2 చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ నెల 14న విడుదలైన చిత్రం రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది KGF2. ఈ చిత్రంపై ఇప్పటికే బాలీవుడ్ సినీ ప్రమఖులు ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, తాజాగా ఈ పిక్చర్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..చిత్రం గురించి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

KGF2 మూవీ యూనిట్ సభ్యులకు తన ట్వీట్ లో శుభాకాంక్షలు తెలిపారు బన్నీ. యశ్, సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టిల నటనతో పాటు భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీ అని పొగిడేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ విజన్, కన్విక్షన్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. KGF2 ఇండియన్ సినిమా ఫ్లాగ్ ను ఎగురవేస్తున్నదని అన్నారు.

 

KGF2 కంటే ముందర విడుదలైన ‘పుష్ప’ చిత్రం కూడా బాలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ చేసింది. అలా ‘పుష్ప’ తర్వాత RRR తర్వాత KGF2 ..ఇలా దక్షిణాది చిత్ర సీమకు చెందిన సినిమాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతుండటం పట్ల సినీ పరిశ్రమ ప్రముఖులు, పరిశీలకులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మాత్రమే ఉంటుందని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news