అల్లు అర్జున్ కి పవన్ షాక్, మెగా ఫాన్స్ కి సూపర్ న్యూస్…!

నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా సంక్రాంతి హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు సినిమా అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమాపై బన్నీ భారీ ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అటు మెగా అభిమానులు కూడా,

ఈ సినిమా మీద ఎక్కువగానే ఆశలుపెట్టుకున్నారు. సంక్రాంతికి మూడేళ్ళ నుంచి కూడా మెగా ఫ్యామిలీలో హిట్ అనేది లేకుండా పోయింది. దీనితో అల్లు అర్జున్ సినిమాపై ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఫలితంపై పలువురు సిని ప్రముఖులు అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సైతం కంగ్రాట్స్ బావా అంటూ బన్నీకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడుకి శుభాకాంక్షలు చెప్పారు. అలవైకుఠపురంలో సినిమా సక్సెస్ అయినందుకు మీకు శుభాకాకంక్షలు. భవిష్యత్తులో నువ్వు మరిన్ని విజయాలు అందుకోవాలంటూ పవన్ ఓ ప్లవర్స్ బొకేతో పాటుగా ఓ కార్డ్ కూడా పంపారు. ఈ గిఫ్ట్ అందుకున్న అల్లు అర్జున్, వాటి ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో పేజీల్లో పోస్ట్ చేసాడు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ఇలా మెసేజ్ వస్తుందని తను ఏ మాత్రం అనుకోలేదన్నాడు.