మహేష్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన అల్లుఅర్హ..!

-

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలలో తప్పనిసరిగా చైల్డ్ ఆర్టిస్టులు ఉంటున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాను మొదులుకొని బింబిసారా, అఖండ వంటి సినిమాలలో కూడా ఇలా చైల్డ్ ఆర్టిస్టులు నటించి సినిమాలకే ప్రాణం పోశారు. ఇకపోతే ఈమధ్య కాలంలో చైల్డ్ ఆర్టిస్టుల హవా ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు కూడా భారీ పాపులారిటీని దక్కించుకుంటోంది . అల్లు అర్హ కు సంబంధించిన ప్రతి చిన్న వీడియోను ఆమె తల్లి అల్లు స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపను బాగా వైరల్ చేసిన విషయం తెలిసిందే.

అంతేకాదు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఇప్పుడు మరొక సినిమాలో కూడా నటించడానికి సిద్ధమైంది ఈ చిన్నారి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ఖలేజా, అతడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ తెరపైకి రాబోతోంది.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఒక పాత్ర కోసం అల్లుఅర్హాను తీసుకోవడానికి చిత్ర బృందం ఆలోచించిందట.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఒకటి ఉందని ఈ విషయాన్ని త్రివిక్రమ్, మహేష్ బాబు అల్లు అర్జున్ దగ్గర చెప్పడంతో అల్లు అర్జున్ కూడా తన కూతుర్ని మహేష్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది .. ముద్దు ముద్దు మాటలతో క్యూట్ గా కనిపించే ఈ చిన్నారి ఇప్పుడు మహేష్ సినిమాలో అవకాశం దక్కించుకో బోతోందని తెలిసి ఈ చిన్నారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news