అమ‌లాపాల్ ఆమె మూవీ టీజ‌ర్‌.. న‌గ్నంగా క‌నిపించి షాక్ ఇచ్చింది..!

2335

అమ‌లాపాల్ న‌టించిన ‘ఆమె’ టీజ‌ర్‌ను చిత్ర‌యూనిట్ తాజాగా విడుద‌ల చేయ‌గా.. దానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.

సినిమాల్లో ఎవ‌రికైనా స‌రే.. న‌టీ న‌టులుగా మంచి గుర్తింపు వ‌స్తే.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించే క్యారెక్ట‌ర్ల‌నే ఎవ‌రైనా చేస్తారు. కానీ ప్ర‌యోగాలు చేసేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. ఏం చేస్తే ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తారోన‌ని న‌టీన‌టుల‌కు భ‌యం ఉంటుంది. అందుక‌నే వారు భిన్న‌మైన పాత్ర‌లు చేస్తారు కావ‌చ్చేమో కానీ.. బోల్డ్ క్యారెక్ట‌ర్లు చేసేందుకు కొద్దిగా సంశ‌యిస్తుంటారు. అయితే న‌టి అమ‌లాపాల్ మాత్రం ఇందుకు భిన్న‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఆమె ఒక అడుగు ముందుకు వేసి ఎవ‌రూ చేయ‌న‌టువంటి ఓ భిన్న‌మైన పాత్ర‌లో న‌టించింది. ఆమె న‌టించిన మూవీ ‘ఆమె’ (తమిళంలో ఆడై) టీజ‌ర్‌ను చూస్తే మ‌న‌కు ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

అమ‌లాపాల్ న‌టించిన ‘ఆమె’ టీజ‌ర్‌ను చిత్ర‌యూనిట్ తాజాగా విడుద‌ల చేయ‌గా.. దానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. అమ‌లాపాల్ నిజంగా ఇలాంటి క్యారెక్ట‌ర్ చేసిందా.. అంటూ చాలా మంది షాక్‌కు గుర‌వుతున్నారు. ఇక ప‌లువురు సెల‌బ్రిటీలు అయితే.. నిజంగా ఇలాంటి క్యారెక్ట‌ర్లు చేయాలంటే బాగా ధైర్యం ఉండాల‌ని.. అమ‌లాపాల్ మాత్రం ఈ క్యారెక్ట‌ర్ చేసేందుకు బాగా సాహ‌సించింద‌ని చెబుతున్నారు.

న‌టి స‌మంత‌తోపాటు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా అమ‌లాపాల్ ఆమె మూవీ టీజ‌ర్‌ను చూసి ఆమె న‌ట‌నను మెచ్చుకున్నారు. ఇలాంటి క్యారెక్ట‌ర్లు చేయాలంటే ధైర్యం బాగా ఉండాల‌ని.. అమ‌లాపాల్‌కు వారు బెస్ట్ ఆఫ్ ల‌క్ చెబుతున్నారు. కాగా ఆమె మూవీని వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండ‌గా, ర‌త్న‌కుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఇక టీజ‌ర్‌లో అమ‌లాపాల్ న‌గ్నంగా కనిపించ‌డం.. అందుకు దారి తీసిన ప‌రిస్థితుల‌ను చూస్తే.. ఈ సినిమాను అత్యాచార నేప‌థ్యంలో తెర‌కెక్కించార‌ని మ‌న‌కు తెలుస్తుంది. ఏది ఏమైనా.. ఈ మూవీ ద్వారా అమ‌లాపాల్ సెన్సేష‌న్ సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది..!