అమితాబ్ బచ్చన్ స్పెషల్ విషెస్ టూ రాం చరణ్..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ అంతా ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూశారు. కాని ప్రెస్ మీట్ నాడు రివీల్ చేసిన పోస్టర్ నే మళ్లీ వదిలారు. ఆర్.ఆర్.ఆర్ నుండి అప్డేట్ రాలేదని ఫీల్ అవుతున్న మెగా ఫ్యాన్స్ కు బిగ్ బీ అమితాబ్ రాం చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో సంబరపడుతున్నారు. అమితాబ్ స్పెషల్ గా రాం చరణ్ కోసం ఓ వీడియో మెసేజ్ పంపించారు.

ఈ పుట్టినరోజు చరణ్ కు ఎన్నోళ్లొస్తాయో తెలియదు కాని చరణ్ ఎప్పుడూ తనకి 18 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడని.. చివరగా రాం చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలుగులో చెప్పారు అమితాబ్. రాం చరణ్ నిర్మిస్తున్న సైరా నరసిం హా రెడ్డి సినిమాలో అమితాబ్ నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో నరసిం హా రెడ్డి గురువుగా అమితాబ్ కనిపిస్తున్నారు. తెలుగులో అమితాబ్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ రోల్ సినిమా ఇదే అవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news