హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌తో అనా డి అర్మాస్ డేటింగ్..?

-

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ గత కొద్ది రోజులుగా హాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 63 ఏండ్లు ఉన్న టామ్ 37 ఏళ్ల అనా డీతో డేటింగ్ ఉన్నట్టు ఇప్పటికే పలు హాలీవుడ్ కథనాలు వెల్లడించాయి. తాజాగా వీరిద్దరూ లండన్ లో చేతులు పట్టుకొని కలిసి నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వార్తకు మరింత బలం చేకూరినట్టయింది.

Tom Cruise – Ana de Armas

అభిమానులు మాత్రం ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి “డీపర్” అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. అది కేవలం వృత్తి పరమైన సంబంధం మాత్రమేనని.. కొందరూ వ్యాఖ్యానించారు. ఈ వార్తలపై ఇప్పటివరకు టామ్ క్రూజ్ కానీ అనా డీ అర్మాస్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. వీరిద్దరూ తమ రిలేషన్ పై మౌనం వహించడంతో ఈ పుకార్లకు మరింత ప్రాధాన్యత లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news