10 శాతం రిజర్వేషన్లో ఇంత కుట్ర ఉందా?…

-

భాజపా ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు తీసుకున్న నిర్ణయం పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. అయితే వివిధ రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నేతలు తొలుత ఈ నిర్ణయాన్ని ఆహ్వానించినప్పటికీ ఆ తర్వాత రిజర్వేషన్ లోని కుట్రను వారు కనుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ అంశంపై స్పందిస్తూ… ఇందులో పెద్ద కుట్ర ఉందని కేజ్రీవాల్‌ ఈరోజు ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం కేవలం జనరల్‌ కేటగిరీలోని పేదలకు ఉద్యోగాలు, చదువులో రిజర్వేషన్‌ కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కోటా ప్రతిపాదించలేదని, ఇతర కుల ఆధారిత రిజర్వేషన్లకు అంతం పలికేందుకు భాజపా ప్రభుత్వం వేసిన పెద్ద ప్రణాళికలో ఇదీ భాగమని వివరించారు.

వీటికి సంబంధించిన అనేక విషయాలను కొంత మంది ప్రముఖులతో కేజ్రీవాల్ పంచుకోగా … అందులో ఎక్కువ మంది ఇది భాజపా వ్యూహం అని భావిస్తున్నట్లు పేర్కొన్నారు అంటూ ఆయన వివరించారు. ఇది చాలా డేంజరస్‌’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. అయితే  గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ సైతం ఆయన అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తాను ఈ కోటా విషయంపై కొందరు ఆరెస్సెస్‌ నేతలతో మాట్లాడానని.. ఇది కుల ఆధారిత రిజర్వేషన్‌ను నిలిపేసేందుకు తొలి అడుగు అని మేవానీ ఆరోపించారు. ఏది ఏమైన అగ్రవర్ణాల  పేదలకు ఈ రిజర్వేషన్ల అంశం అందని ద్రాక్షలాగానే మిగిలేట్టు ఉందని, వామ్మో ఇంత కుట్ర ఉందా… అసలు ఈ రిజర్వేషన్ల వల్ల  ఎవరికి లాభం అంటూ… నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news