ఐకాన్ స్టార్ మూవీలో అన‌సూయ‌.. ఆక‌ట్టుకుంటానంటున్న రంగ‌మ్మ‌త్త‌

షోలు, ప్రోగ్రామ్ ల‌తో వ‌చ్చిన క్రేజ్‌ను బాగానే వాడుకుంటోంది యాంక‌ర్ అన‌సూయ‌. ఈ పేరుతో టాలీవుడ్ బిగ్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ లో ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారును ఫిదా చేస్తోంది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయినా కూడా గ్లామ‌ర్ డోస్ ఏ మాత్రం త‌గ్గించ‌ట్లేదు ఈ ముద్దుగుమ్మ‌. యూత్ లో మంచి పేరు ఉండ‌టంతో కొన్ని ఐట‌మ్ సాంగ్స్ కూడా చేస్తోంది. అంతే కాదు ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పిస్తోంది.


మొన్న రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి.. త‌న‌కు రంగ‌మ్మ‌త్త మ‌రోపేరు అన్న రేంజ్‌లో హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు ప‌లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ న‌టిస్తోంది. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా అన‌సూయ మాత్రం త‌న మ‌న‌సుకు న‌చ్చిన సినిమాల‌నే చేస్తాన‌ని చెప్పేస్తోంది. గతంలో ఎన్నో రకాల పాత్రలు చేసిన ఈ హాట్ యాంక‌ర్.. ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది మాత్రం రంగస్థలం సినిమాతోనే అని చెప్పాలి. ఇక‌ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ఎంత పెద్ద విజ‌యం న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక మరోసారి అలాంటి పాత్ర చేయడానికి రెడీ అవుతోంద‌ట‌. ఈసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అని ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అన‌సూయ త‌న కొత్త ట్యాలెంట్ తో ఆకట్టుకోబోతున్నట్లు టాక్‌. ఇక సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. మ‌రి అన‌సూయ ఈ సారి ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.