మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ…! నా ఇల్లు అక్కడ లేదు…!

-

టాలివుడ్ లో కొన్ని రోజుల నుంచి ఐటి దాడుల సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు మీద ఐటి దాడులు జరిగినప్పటి నుంచి కూడా ప్రతీ వారం ఎవరో ఒకరి మీద ఐటి దాడులు అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏదైనా దీనికి సంబంధించి వార్త రావడం ఆలస్యం మీడియా కూడా వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కథనాలు ప్రసారం చేసే పనిలో పడింది. తాజాగా యువ హీరోయిన్ లావణ్య త్రిపాఠి విషయంలో ఇదే జరిగింది.

ఆమె ఇల్లు, ఆఫీసులపై ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనికి కొన్ని వెబ్ సైట్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. తాజాగా యాంకర్లు సుమ అనసూయ మీద కూడా అలాంటి ప్రచారమే ఎక్కువగా జరిగింది. దీనిపై అనసూయ ఫైర్ అయింది. వార్తలు రాసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక లేఖ విడుదల చేసింది. మీడియా మిత్రులారా.. నా ఇళ్లు బంజార హిల్స్‌లో లేదని… అలాగే నా ఇంటి మీద ఏ ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారులు రైడ్ చేయలేదని స్పష్టం చేసింది.

మీడియా అధికారిక సమాచారం ఇవ్వాలిగాని, మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఊహలు వెల్లడించకూడదని చురకలు అంటించింది. ఈ రంగంలో కొనసాగుతూ పేరు, గౌరవం సంపాదించుకోవడానికి మేం ఎన్నో త్యాగాలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. బలమైన రంగంమైన మీడియా సమాజానికి మంచి చేస్తూ, మంచి వైపు నడిపించే దిశగా ప్రయత్నించాలని సూచించింది. అంతేగాని ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్న వ్యక్తుల జీవితాలను గాయపరచకూడదని కోరింది. నేను మీడియాను గౌరవిస్తాను. మీరు ఓ వార్తను రాసేప్పుడు నిజానిజాలు సరిచూసుకోండని ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news