విజృంభించిన సైనీ.. కష్టాల్లో విండీస్..

-

కటక్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న ఫైనల్ వన్డే మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన పేసర్ నవదీప్ సైనీ అదరగొడుతున్నాడు. ఇప్పటికి ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన సైనీ 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు దిశగా సాగిపోతున్న రోస్టన్ చేజ్ (38), షిమ్రోన్ హెట్మెయర్ (37)లను అవుట్ చేసిన సైనీ వెస్టిండీస్ ను కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 33 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు. నికోలాస్ పూరన్, కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నారు.

ఇద్దరు సీమర్లకే ఓకే చెప్పడంతో సైనీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆగస్ట్ 3, 2019న జరిగిన టీ20 మ్యాచ్‌తో టీమిండియా తరపున సైనీ తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌‌లో కూడా వెస్టిండీస్ జట్టే ప్రత్యర్థి కావడం విశేషం. కాగా, వెస్టిండీస్‌తో కటక్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. రెండు జట్లూ చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news