బిగ్ బాస్ 3లో యాంకర్ లాస్య.. కన్ఫమ్ అట..!

-

జులై నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లలో ఈసారి కూడా నిర్వాహకులు వైవిధ్యం ప్రదర్శించారు. కొందరు యాంకర్లు, నటులు, సింగర్స్, రాజకీయ నాయకులు, కమెడియన్స్, క్రీడా ప్రముఖులు.. ఇలా పలు రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నవారిని ఎంపిక చేసుకున్నారట.

మొన్నటి దాకా తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల హడావుడి ఉండేది. ఆ హడావుడి అయిపోయినట్టే ఇక. ఇప్పుడు మరో హడావుడి స్టార్ట్ అయింది. అదే బిగ్ బాస్ సందడి. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతున్నది తెలుసు కదా. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా యాజమాన్యం. సీజన్ 3 హోస్ట్‌గా కూడా నాగార్జున ఫిక్స్ అయ్యాడు. ఆయన ఇటీవలే ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆయన ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోలోనూ చివర్లో ఆయన ముఖాన్ని కనిపించీ కనిపించకుండా చూపిస్తారు. అయితే.. అతడు నాగ్ అని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో నాగార్జునే సీజన్ 3కి హోస్ట్ అని బిగ్ బాస్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

కంటెస్టెంట్ల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయిందట. కంటెస్టెంట్ల లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌గా యాంకర్ లాస్యను తీసుకున్నారట. యాంకర్ లాస్య తెలుసు కదా మీకు. యాంకర్ రవితో కలిసి పలు బుల్లి తెర షోలలో యాంకర్‌గా పనిచేసింది. తర్వాత పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే.. మళ్లీ బుల్లి తెరపై లాస్య తన కెరీర్‌ను కొనసాగించాలనుకుంటోందట. అందుకే.. బిగ్ బాస్ ద్వారా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నదట లాస్య. ఆమెను బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్‌గా కన్ఫమ్ కూడా చేశారట.

జులై నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లలో ఈసారి కూడా నిర్వాహకులు వైవిధ్యం ప్రదర్శించారు. కొందరు యాంకర్లు, నటులు, సింగర్స్, రాజకీయ నాయకులు, కమెడియన్స్, క్రీడా ప్రముఖులు.. ఇలా పలు రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నవారిని ఎంపిక చేసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news