హాట్ హాట్‌గా ర‌ష్మి శివ‌రంజ‌ని సినిమా ట్రైల‌ర్‌.. ఇదైనా హిట్ అవుతుందా..?

ర‌ష్మిగౌతం, నందులు జంట‌గా న‌టిస్తున్న శివ‌రంజ‌ని చిత్రంలో నందిని రాయ్ మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ లాంచ్ చేశారు.

జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ వెండితెర‌పై హీరోయిన్‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే ఉంది. కానీ ఆమెకు ల‌క్ క‌ల‌సి రావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన‌ప్ప‌టికీ అవేవీ హిట్ కాలేక‌పోయాయి. అయినప్ప‌టికీ ర‌ష్మికి చాన్సులు వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె న‌టించిన చిత్రం శివ‌రంజ‌ని త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను కొంత సేప‌టి కింద‌టే లాంచ్ చేశారు.

ర‌ష్మిగౌతం, నందులు జంట‌గా న‌టిస్తున్న శివ‌రంజ‌ని చిత్రంలో నందిని రాయ్ మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ లాంచ్ చేశారు. హార్ర‌ర్, కామెడీ జ‌న‌ర్స్‌లో ఈ సినిమాను తెర‌కెక్కించ‌గా ఇందులో ఢిల్లీ రాజేశ్వ‌రి, అఖిల్ కార్తీక్‌, ధ‌న్‌రాజ్‌లు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

ఇక శివ‌రంజ‌ని సినిమాలో హార్ర‌ర్‌, కామెడీల‌కు ఏ మాత్రం కొదువ లేద‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. అలాగే ర‌ష్మికి, నందుకు మ‌ధ్య ప‌లు రొమాంటిక్ స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రించిన‌ట్లు ట్రైల‌ర్‌లో మ‌న‌కు క‌నిపిస్తుంది. అయితే గ‌తంలో ప‌లు చిత్రాల్లో ర‌ష్మి హాట్ హాట్‌గా క‌నిపించి యువ‌త‌ను అల‌రించ‌గా, ఇప్పుడీ సినిమాలో కూడా అదే స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని మ‌న‌కు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. మ‌రి ఈ సినిమానైనా ర‌ష్మికి బ్రేక్ ఇస్తుందా, లేదా అన్న‌ది చిత్రం చూస్తే తెలుస్తుంది. అందుకు మ‌రికొన్ని రోజుల వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు..!