వైరల్ ఫోటోలు: అరె.. అచ్చు గుద్దినట్టు ఐశ్వర్యారాయ్ లా ఉందే.. ఎవరీమె?

ఐశ్వర్యారాయ్.. ప్రపంచంలోని అందగత్తెల్లో ఒకరు. అంతేనా.. తనకు 1994నే మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ వయసు 45 ఏళ్లు అయినప్పటికీ.. ఒక కూతురు ఉన్నప్పటికీ.. తన అందం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అది ఐశ్వర్యారాయ్ అంటే.

ఐశ్వర్యారాయ్.. ఆమె అందాన్ని చూసి రోబో కూడా ప్రేమలో పడిపోతుంది. అది సినిమా అనుకోండి. నిజంగా కూడా ఐశ్వర్యారాయ్ ది రోబోను ప్రేమలో పడేసేంత అందం. ముఖ్యంగా ఆమె నీలికళ్లు.. ఆ కళ్లను అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అందమైన కళ్లు ఆమెవి.

ఐశ్వర్యారాయ్.. ప్రపంచంలోని అందగత్తెల్లో ఒకరు. అంతేనా.. తనకు 1994నే మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ వయసు 45 ఏళ్లు అయినప్పటికీ.. ఒక కూతురు ఉన్నప్పటికీ.. తన అందం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అది ఐశ్వర్యారాయ్ అంటే.

ఇప్పుడు మనం చదువుకోబోయే ఆమె అచ్చం ఐశ్వర్యారాయ్ లాగానే ఉంటుంది. అచ్చు గుద్దినట్టు ఉంటుంది. ఏమాత్రం డౌట్ రాదు మీకు. అరె… ఐశ్వర్యారాయ్ లా ఉందే? అని కన్ఫ్యూజ్ అవుతారు.

ఆమె.. ఇరాన్ కు చెందిన మోడల్. పేరు మహ్లగా జబేరీ. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకంటే.. ఆమె అచ్చం ఐశ్వర్యారాయ్ లా ఉంటుంది కాబట్టి. ఈమె ఇప్పటి వరకు ఇరాన్ లో చాలా యాడ్ ఫిలింస్ లోనూ నటించింది. ప్రస్తుతం ఈమెను నెటిజన్లు.. జూనియర్ ఐశ్వర్యారాయ్, ఇరానీ ఐష్ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు.

ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. 2.8 మిలియన్ ఫాలోవర్స్ కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే ఉన్నారు. ఈమె పేరుకు ఇరాన్ మోడల్ కానీ.. ఈమె ఉండేది మాత్రం యూఎస్ లోని కాలిఫోర్నియాలో.

ఈమె అచ్చం ఐష్ లా ఉండటంతో… ఐష్ అభిమానులంతా ఆమెను లైక్ చేస్తుండటంతో.. ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ ఆమె థాంక్స్ చెబుతోంది. ఆమెకు కూడా ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టమేనట. ఆమె సినిమాలు చూస్తుందట. ఆమెను అంతా జూనియర్ ఐష్ అంటుంటే ఎంతో సంతోషంగా ఉందట.