‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ కు ముందే అనిల్ రావిపూడికి భారీ సర్ప్రైజ్….ఏంటో తెలుసా….??

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మంచి యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి నిన్న ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు. మహేష్ గారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం అలరించేలా ఈ సినిమా ఉంటుందని కూడా ఆయన అన్నారు.

ఇక ఇప్పటివరకు కెరీర్ పరంగా తీసిన నాలుగు సినిమాలతో కూడా మంచి హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి, టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు మరొక వారం రోజుల సమయం ఉన్నప్పటికీ, దర్శకుడు అనిల్ కు నేడు ఒక భారీ సర్ప్రైజ్ లభించింది. అదేమిటంటే, నేడు అనిల్ భార్య భార్గవి, ఒక మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. కాసేపటి క్రితం ఈ న్యూస్ బయటకు రావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్విట్టర్ వేదికగా అనిల్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

‘నేడు మగబిడ్డకు జన్మనిచ్చిన అనిల్ దంపతులకు నా శుభాకాంక్షలు, ఆ బిడ్డకు అందరి నుండి ప్రేమ, ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడికి భార్గవితో కొన్నాళ్ల క్రితం వివాహం జరుగగా, వారికి ఇప్పటికే శ్రేయస్వి అనే పాప కూడా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో సరిలేరు సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఉండడంతో పాటు, సరిగ్గా ఇదే సమయంలో దర్శకుడు అనిల్ కు మగబిడ్డ జన్మించడంతో పలువురు ఆ సినిమా యూనిట్ సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా అనిల్ కు తమ సోష మీడియా అకౌంట్స్ ద్వారా విషెస్ తెలియచేస్తున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news