ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే అనేక కమిటీలు మరియు వాటి రిపోర్టులు గమనించడం జరిగింది. మూడు రాజధానుల విషయంలో కమిటీలు మరియు రిపోర్టుల ఆధారంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు అనేక వార్తలు ఇటీవల ఏమన్న పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014 సంవత్సరంలో ఎన్నికైన సందర్భంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు రాజధాని పై జగన్ వేసిన కమిటీ ఎలా పట్ల రిపోర్టుల పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఎన్ని అనుకొన్న ఎన్ని చేసినా అమరావతి రాజధాని విషయంలో న్యాయస్థానంలో జగన్ కు ఎదురు దెబ్బ తగలడం గ్యారెంటీ అని కోర్టులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవటం గ్యారెంటీ అని దీంతో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు మరింత ఉదృతంగా ఆందోళనలు నిరసనలు చేస్తే ఖచ్చితంగా అమరావతి మరియు మూడు రాజధానులు విషయం బట్టి జగన్ సర్కార్ కి ప్రమాదం వాటిల్లే చాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఐ వి ఆర్. మొత్తం మీద అమరావతి విషయంలో ఆందోళనలు చేస్తున్న రైతుల విషయంలో జగన్ ఎన్ని ప్లాన్లు వేసినా అవి వర్కవుట్ కావు అనే మాటలే ఎక్కువగా కనబడుతున్నాయి.
ఇప్పటికే వైయస్ జగన్ కి.. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలు రిపోర్టులు ఇవ్వటం జరిగాయి. ఇంకా చివరిగా హైపవర్ కమిటీ నివేదిక ఒక్కటి రావాల్సి ఉంది. ఆ కమిటీ నివేదిక వచ్చిన తరువాత జగన్ సర్కార్ అమరావతి రాజధాని విషయం లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.