పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అంజలి..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు పొందిన వారిలో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. అయితే కొన్ని వివాదాస్పందమైన సంఘటనలో చిక్కుకోవడం వల్ల ఈమె ఏప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలలో నిలుస్తూ ఉంటుంది.ముఖ్యంగా ఈమె పెళ్లి విషయం గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా తాజాగా పెళ్లి వార్తలు గురించి రావడంతో అంజలి స్పందించడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

అంజలి మాట్లాడుతూ..గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి తనకు వివాహమైందని అమెరికాలో నివాసం ఉంటున్నట్లుగా ఎన్నో కథలు వస్తున్నాయి.. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలియజేసింది అంజలి. ఇప్పుడే తనకు వివాహం చేసుకోవాలని ఆలోచన అసలు లేదని తెలియజేయడం జరిగింది. అయితే పెళ్లి విషయంలో తనకు కూడా ఒక మంచి ఒపీనియన్ ఉందని సరైన సమయం వస్తే కచ్చితంగా అందరికీ చెప్పే తాను వివాహం చేసుకుంటానని తెలియజేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో పాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.

అంజలితో పాటు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది హీరోయిన్స్ ఇప్పటికే వివాహం చేసుకోగా అంజలి మాత్రం వివాహమంటే కాస్త దూరంగానే ఉంటుందని చెప్పవచ్చు. మరి త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి. రీసెంట్గా అంజలి ఫాల్ అని పేరుతో తెరకెక్కించిన ఒక వెబ్ సిరీస్లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ప్రమోషన్లలో భాగంగా అంజలి ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న RC -15 చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news