గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం “వారాహి” పై చర్చ నడుస్తోంది. ఆర్మీ కలర్ లో వారాహి రంగు ఉండడం వివాదానికి కారణమైంది. వారాహి రంగు పై ఏపీలో అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. అది వారాహి కాదని నారాహి అని.. ఆలీవ్ గ్రీన్ రంగు కాకుండా పసుపు కలర్ వేసుకోవాలని చురకలంటించారు.
అయితే,పవన్ కళ్యాణ్ వారాహి వాహనం వివాదంపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోక్యం చేసుకున్నారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన రవాణా శాఖ అధికారులను ఆదేశించి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు అజయ్. పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఎలాంటి అభ్యంతరం లేవని ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ తెలిపారు. గత వారమే ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. అన్ని రూల్స్ కు లోబడే ఈ ప్రక్రియ ముగిసింది అని వెల్లడించారు. వారాహి రంగు అలీవ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని పువ్వాడ అజయ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ రిలీఫ్ లభించింది.