గరికపాటిపై RGV మరో సంచలన ట్వీట్… ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ !

-

మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అలాయ్‌ – బలాయ్‌ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటనపై ఇప్పటికే ఆర్జీవీ స్పందించారు. హే గరికపాటి..నువ్వు గడ్డి పరకతో సమానం అంటూ RGV సెటైర్ వేశారు. అయితే తాజాగా మరోసారి గరికపాటిని టార్గెట్ చేశారు వర్మ.

గరికపాటి నరసింహారావు పై వర్మ విమర్శలకు దిగుతూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. నెమలి బ్రహ్మచర్యానికి సంకేతమని.. ఆడ నెమలితో కలవకుండా పిల్లలను కంటాయని గరికపాటి ఓ ఇంటర్వ్యూలో చెబుతారు. కానీ సైన్స్ ప్రకారం మగా మరియు ఆడ నెంబర్లు కలుసుకునే సన్నివేశాన్ని వీడియోలో జోడించాడు వర్మ. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లో వర్మ కు సపోర్ట్ గా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. గరికపాటికి తగిన బుద్ధి చెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news