ఇండస్ట్రీకి మరో వారసుడు ఎంట్రీ సిద్ధం..!

-

ప్రస్తుతం నటీనటులు ఒక్కొక్కరిగా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సునీతను మొదలుకొని యాంకర్ సుమా వరకు ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటుంటే.. ఇక వెండితెరపై రాజ్యం ఏలుతున్న బాలకృష్ణ లాంటి హీరోలు తమ వారసుల ఎంట్రీ కి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక సీనియర్ నటుడి వారసుడు కూడా సినీ రంగం ఎంట్రీ కి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.

యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవరాజు తనయుడు ప్రణం దేవరాజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సాయి శివం జంపాన దర్శకత్వంలో జె.మల్లికార్జున నిర్మిస్తున్న చిత్రం వైరం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు దేవరాజ్, చంద్ర రాజుల చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేయగా.. బెనర్జీ, కాశీ విశ్వనాథ్ చేతుల మీదుగా వైరం టీజర్ విడుదల చేశారు.

ఆ తర్వాత దేవరాజ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా ఆదరించారు.. ఇప్పుడు వస్తున్న నా కొడుకుని కూడా అదే విధంగా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .. దర్శకుడు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా టీజర్ కు కన్నడలో కూడా మంచి రెస్పాన్స్ లభించింది. తెలుగు టీజర్ కూడా అంతే బాగుందని చెబుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలిపారు దేవరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news