అన్నదాతలకు గుడ్ న్యూస్..నిమిషాల్లో రూ.లక్షా 60 వేల లోన్… అది కూడా ఇంట్లో నుండే…!

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ని చెప్పనుంది. పూర్తి వివరాలని చూస్తే..

farmers

రైతులకు మెరుగైన సేవలు ని ఇస్తోంది. ఈజీగా లోన్ ని పొందొచ్చు రైతులు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ సేవలు ని తీసుకు వచ్చింది. దీనితో బ్యాంక్ కి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో డిజిటల్ కేసీసీ లోన్ ని పొందొచ్చు. రిజర్వు బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని తీసుకొచ్చింది.

రూ. 1.6 లక్షల వరకు రుణం పొందొచ్చు. బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లోన్ కోసం అప్లై చెయ్యచ్చు. ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అలానే శాటిలైట్ ఇమేజరీ అండ్ మ్యాపింగ్ ద్వారా క్రాప్ ఇన్ఫర్మేషన్ ని పొందుతారు. ఆధార్ ఆధారిత ఇసైన్ ద్వారా డాక్యుమెంట్లు ని సబ్మిట్ చేసుకోవచ్చు.

ఎలా లోన్ ని పొందొచ్చు..?

డాక్యుమెంట్లు ని ఆధార్ ఆధారిత ఇసైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు.
లోన్ డాక్యుమెంటేషన్, రుణ మంజూరు వంటివి అన్నీ కూడా ఆన్‌లైన్‌ లోనే జరుగుతాయి.
మొబైల్ బ్యాంకింగ్ యాప్ VYOM ఫోన్‌లో ముందు ఇంస్టాల్ చెయ్యాలి.
ఆ తరవాత యాప్ లో లోన్స్ అనే ఆప్షన్‌ లోకి వెళ్లాలి.
కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ని ఎంపిక చేసుకోండి.
ఇప్పుడు మీరు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
కొత్త అప్లికేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసుకోండి.
ఆ తర్వాత మీకు లోన్ వివరాలు కనిపిస్తాయి.
రూ. 1.6 లక్షల లోన్ వస్తుంది. వడ్డీ రేటు 9.3 శాతంగా వుంది.
ఆధార్ కార్డు ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఓటీపీ వస్తుంది. అలానే ఇతర డీటెయిల్స్ ని కూడా ఇవ్వాల్సి వుంది.