అదిరే స్కీమ్… రూ.25 లక్షలు… పొందండి ఇలా..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి స్కీమ్‌ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో అదిరే లాభాలని పొందొచ్చు. రిస్క్ లేకుండా రాబడి కూడా పొందొచ్చు. భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి స్కీమ్‌ను తీసుకు వచ్చింది. పదేళ్ల లోపు ఆడ పిల్లలను ఈ స్కీమ్‌లో చేర్పించవచ్చు.

ఇందులో చేరితే మంచి రాబడి వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ వస్తోంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. 15 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు మీరు దీనిలో పెట్టచ్చు.

ఈ స్కీము లో మీరు ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చెయ్యచ్చు. ఇన్వెస్ట్ చేసే దాని బట్టీ వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కూడా మారుతుంది. నెలకు రూ. 5 వేలు డిపాజిట్ చేయాలని చూస్తుంటే మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఏడాదికి రూ. 60 వేల చొప్పున 15 ఏళ్లలో మీరు రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. వడ్డీ రూపంలో రూ. 16.46 లక్షలు వస్తాయి. వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది.

రూ. 25 లక్షలకు పైగా వస్తాయి ఈ స్కీమ్ తో వస్తాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి ని ఈ స్కీమ్ తో పొందొచ్చు. మీ పాప పేరుపై నెలకు రూ. 5 వేలు డిపాజిట్ చేస్తే… 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఏడాదికి రూ. 60 వేల చొప్పున 15 ఏళ్లలో మీరు రూ. 9 లక్షలు పెడితే మీకెప్పుడు వడ్డీ రూపంలో రూ. 16.46 లక్షలు వస్తాయి. మొత్తం రూ. 25 లక్షలకు మీకు అందుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news