కన్నడ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..!

ఈ ఏడాదంతా ఏ రంగానికి మంచిగా లేదు.. అందరూ కరోనా దెబ్బకు గురైనవారే.. సినీ పరిశ్రమలో అయితే షూటింగ్లు లేక ఇళ్లలోనే గడిపారు. ఇప్పుడిప్పుడే కాస్త ప్రారంభమయ్యాయి అనుకుంటే చాలమట్టుకు కరోనా భారిన పడుతున్నారు.. ఈ ప్రభావం కన్నడనాట మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే అక్కడ చిరంజీవి సర్జ, బుల్లెట్ ప్రకాశ్ సహా మరికొందరు నటులు కూడా 2020లోనే మరణించారు. తాజాగా గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు షాహురాజ్ షిండే మృతిచెందారు.

directer
directer

దర్శకత్వమే కాదు.. హీరోగా కూడా షిండే కొన్ని సినిమాల్లో నటించాడు.. గోల్డెన్ స్టార్ దర్శన్ హోరోగా మూడు సినిమాలు చేశాడు. యాక్షన్ కట్ సినిమాతో షిండ్ హీరోగా నటించాడు.2011లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.. మళ్లీ 2019లో రంగ మందిర్ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే విడుదలకు ముందే ఈయన చనిపోవడం అంతా షాక్ అయిపోయారు..కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

ప్రీతి స్నేహాన, ప్రేమ చంద్రమా, అర్జున్, సినిమాలకు ఈయన దర్శకత్వం వహించాడు. ఛాంపియన్ సినిమా కూడా చేసాడు. ఈయన మరణ వార్త తెలుసుకున్న కన్నడ ఇండస్ట్రీ షాక్ అవుతుంది. యోగా చేయందే ఈయన రోజు ప్రారంభం కాదని.. అలాంటి మనిషికి గుండెపోటు రావడం ఏంటో అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నడ నిర్మాత అశు బేద్రా, సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ఈ వార్త తెలిసి కుమిలిపోతున్నారు.

ఇప్పటికే ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి ధాటికి ఇంకా ఎంత మంది బలవ్వాలో అని భయపడుతున్నారు.. కానీ షిండే మరణం సహజం అయినా కరోనా కాలంలో చనిపోయోసరికి అందరూ ఇదే అనుకున్నారు. 2020 మనుషులను చంపడానికే ఉందా అన్నట్లు ఏదో ఒక రీతిలో ప్రజలు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు..షిండే మరణం కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.