‘సోనా’గా వాణికపూర్..‘షంషేరా’ హీరోయిన్ ఫస్ట్ లుక్ ఔట్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘షంషేరా’. కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో రణ్ బీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెల 22న ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తాజాగా మేకర్స్ ఈ ఫిల్మ్ నుంచి మరో అప్ డేట్ ఇచ్చేశారు. హీరోయిన్ వాణి కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఓ తెగను కాపాడే యోధుడిగా రణ్ బీర్ కపూర్ కనిపించనుండగా, 1800లో భారతదేశంలో పాపులర్ నటి ‘సోనా’ పాత్రను వాణికపూర్ పోషిస్తోంది.

తన పాత్రను దర్శకుడు కరణ్ మల్హోత్ర చక్కగా చిత్రీకరించారని వాణికపూర్ చెప్పుకొచ్చింది. తన తెగ కోసం వీరోచితంగా పోరాడే పాత్రలో రణ్ బీర్ కపూర్ కనిపిస్తాడని, ‘షంషేరా’ స్టోరి ప్రతీ ఒక్కరికి నచ్చుతుందని స్పష్టం చేశాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేశారు. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ సభ్యులు పాల్గొంటారని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఆయన లుక్ చాలా వయ్ లెంట్ గా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)