న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, బౌల‌ర్ బుమ్రాలు ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌..?

779

హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రాలు ప్రేమ‌లో ప‌డ్డార‌ని కొద్ది రోజులుగా నెట్‌లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ప్రేమ‌మ్ అనే మ‌ళ‌యాళ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన భామ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఆ సినిమా త‌రువాత ఆమెకు ప‌లు భాష‌ల్లో అనేక ఆఫ‌ర్లు వ‌చ్చాయి. తెలుగులోనూ అనుప‌మ‌కు అనేక ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ముఖ్యంగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అ..ఆ.. సినిమా అనుమ‌ప‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ త‌రువాత కూడా అనుప‌మ అనేక తెలుగు సినిమాల్లో న‌టిస్తూ వ‌చ్చింది. అయితే ఆమెకు, టీమిండియా క్రికెట్ పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రాకు మ‌ధ్య ల‌వ్ న‌డుస్తుంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.

హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రాలు ప్రేమ‌లో ప‌డ్డార‌ని కొద్ది రోజులుగా నెట్‌లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీరిద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే అందుకు కార‌ణం లేక‌పోలేదు. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ ఒక‌రు పెట్టే పోస్టుల‌ను మ‌రొక‌రు లైక్ చేస్తున్నారట‌. అందుక‌నే వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ న‌డుస్తుంద‌ని ఒక్క‌సారిగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

అయితే ఈ విష‌యంపై స్పందించిన అనుప‌మ ఓ ఇంగ్లిష్ న్యూస్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. అస‌లు త‌మ గురించి ఎవ‌రు ఇలాంటి పుకార్ల‌ను సృష్టించారో తెలియ‌ద‌ని, కానీ ఈ విష‌యంలో ఏ మాత్రం నిజం లేద‌ని అనుప‌మ తెలిపింది. త‌మ మ‌ధ్య ఉన్న‌ద కేవ‌లం స్నేహం మాత్ర‌మేన‌ని, తాము మంచి ఫ్రెండ్స్ అని, అందుకే ఒక‌రి పోస్టుల‌ను మ‌రొక‌రం లైక్ చేస్తామ‌ని అనుప‌మ చెప్పుకొచ్చింది. అయితే గ‌తంలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ‌లు కూడా ఇలాగే అన్నారు. కానీ ఆ త‌రువాత వారిద్ద‌రూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. మ‌రి ఇప్పుడు అనుప‌మ‌, బుమ్రాలు కూడా అలాగే చేస్తారా..? వేచి చూస్తే తెలుస్తుంది..!