తిరిగేది బీఎండబ్ల్యూ కారులో… చేసేది మాత్రం కోళ్ల దొంగతనం..!

-

కారు కొనడం గొప్ప కాదు.. దాన్ని మెయిన్ టెన్ చేయడం గొప్ప. దాని మెయిన్ టెన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును భరించే శక్తి ఉన్న వాళ్ళే కారు కొనుక్కోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటారా… పదండి ఓసారి చైనా వెళ్లి వద్దాం.

బీఎండబ్ల్యూ కారు తెలుసు కదా మీకు. చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే గొప్పలకు పోయి బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్న మాట. కారు కొనగానే కాదు కదా… దాన్ని మెయిన్ టెన్ చేయొద్దు.. అక్కడే మనోడికి తడిసి మోపెడు అయ్యింది. కారు కొనడానికి 2 కోట్లు అయితే ఖర్చు పెట్టాడు కానీ దాన్ని మెయిన్ టెన్ చేయలేక పోయాడు.

దీంతో కోళ్ల దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. బాతులు, కోళ్లు కనిపిస్తే చాలు… వాటిని కమ్మేయడం.. అమ్మేయడం.. వచ్చిన డబ్బులతో బీఎండబ్ల్యూ కు పెట్రోల్ కొట్టించుకొని హాయిగా తిరగడం.

అయితే తమ కోళ్లు, బాతులు కనిపించకుండా పోతున్నాయని అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగిన పోలీసులకు డొంక అంతా కదిలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బీఎండబ్ల్యూ కారులో దర్జాగా వచ్చి కోళ్లను, బాతులను దొంగతనం చేస్తున్న మనోడిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టి దొంగతనంపై ఆరా తీయగా మనోడు చెప్పిన మాటలు విని పోలీసులే కంగు తిన్నారు. కారులో పెట్రోలు కొట్టించుకోవడం కోసం ఈ దొంగతనాలు చేశాను అని తన తప్పు ఒప్పుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news